calender_icon.png 23 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి గురైన 1060 సెల్ ఫోన్లు రికవరీ

12-04-2025 12:25:54 AM

-ఫోన్ల విలువ రూ.3 కోట్ల 18 లక్షలు

-చోరీకి గురైన ఫోన్లను బాధితులకు అందజేసిన క్రైమ్స్ డీసీపీ ఎల్.సి. నాయక్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11, సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ని శుక్రవారం తిరిగి బాధితులకు అందజేశారు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు. మొత్తం 1060 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. గత 45 రోజులు శ్రమించి మొత్తం 1060 వందల ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్స్ డీసీపీ ఎల్.సి. నాయక్  తెలిపారు.

చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సిఈఐర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 3 కోట్ల 18 లక్షల విలువ ఉంటుందన్నారు. అనంతరం రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ అరెస్ట్, ఈజీ మనీ, షేర్స్ లలో పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. ఎటిఎం,బ్యాంకు ఖాతాలు,సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా,కొన్నా చట్టపరంగా నేరమని తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ సిబ్బందిని డీసీపీ ఎల్.సి. నాయక్ అభినందించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల పోలీస్ సిబ్బంది, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.