calender_icon.png 8 October, 2024 | 3:03 AM

స్టోక్స్ దూరం

06-10-2024 12:00:00 AM

ముల్తాన్: పాకిస్థాన్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న స్టోక్స్‌కు మొదటి టెస్టుకు విశ్రాంతినిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ‘మొదటి టెస్టుకు అందుబాటులో ఉండేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ కుదరలేదు. రెండో టెస్టుకు అందుబాటులో ఉండేల ప్రణాళికలు వేసుకుంటా.’ అని స్టోక్స్ తెలిపాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఓలీ పోప్ జట్టును వహించనున్నాడు. అక్టోబర్ 7 నుంచి మొదటి టెస్టు జరగనుంది.