calender_icon.png 24 February, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

24-02-2025 04:57:43 PM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. విదేశీ దిగుమతులపై అగ్రరాజ్యం అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారీగా టారిఫ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. గత వారం నుంచి స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు భారీ నష్టాలతో చవిచూసాయి. దీంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 

సెన్సెక్స్ 857 పాయింట్ల నష్టంతో 74,454 పాయింట్లతో ముగిసింది. నిఫ్టీ 243 పాయింట్ల నష్టంతో 22,553 వద్ద స్టాక్ మార్కెట్లు ముగిసింది. కాగా, ఎమ్ అండ్ ఎమ్, రెడ్డిస్ ల్యాబ్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్ర కంపెనీల షేర్లు భారీ లాభాలను అందుకున్నాయి. విప్రో, హెచ్ సీఎల్(Hindustan Computers Limited), టీసీఎస్(Tata Consultancy Services), ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసాయి.