calender_icon.png 12 February, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

11-02-2025 03:56:48 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూసిన మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్  1,018 పాయింట్ల నష్టంతో 76,293 వద్ద, నిఫ్టీ 310 పాయింట్ల నష్టంతో 23,071 వద్ద ముగిసింది. ఇవాళ మదుపరుల సంపద సుమారు రూ.10 లక్షల కోట్ల ఆవిరైపోయినట్లు సమాచారం. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్ట్రాల్లో ముగిశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.