09-04-2025 12:00:00 AM
వెయ్యి పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
375 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
ముంబై, ఏప్రిల్ 8: ట్రంప్ టారిఫ్ బాంబుకు కుదేలైన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా ఫుంజుకున్నాయి. ఉదయం బీఎస్‌ఈలో సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద మొదలైన సూచీ ఒక దశలో 74, 859. 39 పాయింట్లతో గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74, 227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22, 200 పాయిం ట్లతో మొదలైన సూచీ 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది. సోమవారం డాలరుకు 85.84 ఉన్న భారత రూపాయి మారకం విలువ మంగళవారం 86.27గా ఉంది. ప్రపంచ దేశాలతో చర్చల కు సిద్ధమని అమెరికా ప్రకటించిన వేళ ఆసి యా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు బాగా రాణించాయి.
ట్రేడింగ్ వారంలో రెండోరోజు మొదలైనప్పటి నుంచి లాభాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియడం విశేషం. మంగళవారం ట్రేడింగ్ సమయంలో జియో ఫైనాన్షియల్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు నిఫ్టీలో అత్యధిక లాభాలు అందుకున్నాయి. మూలధన వస్తువులు, చమురు, గ్యాస్, పీఎస్‌యూ, రియా ల్టీ, టెలికాం, మీడియా సంస్థలు 2 నుంచి 4 శాతం మధ్య లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 100, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 100 సూ చీలు 2 శాతం మేర లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్ షేర్ల సూచీ మాత్రం ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది.