05-03-2025 04:06:41 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.బుధవారం ఉదయం 9.30 గంటలకు 400 పాయింట్లతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం 740 పాయింట్ల లాభంతో 73,730 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా ఉదయం 118 పాయింట్లతో ప్రారంభమై నిఫ్టీ ముగిసే సమయానికి 254 పాయింట్లతో లాభంతో 22,337 వద్ద ముగిసింది. పది రోజులు వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు బుధవారం సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాబ్ ఫిన్ సర్వ్, జొమాటో షేర్లు మాత్రమే నష్టాల్లో కదులుతున్నాయి.
బుధవారం నిఫ్టీ 50 బెంచ్‌మార్క్‌లో మహీంద్రా & మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.6% పెరిగింది, నిఫ్టీ ఆటో 1.1% పెరిగింది. ఇండెక్స్ హెవీవెయిట్ ఐసిఐసిఐ బ్యాంక్‌లో 1.2% పెరుగుదలతో నిఫ్టీ బ్యాంక్ 0.3% పెరిగింది.