calender_icon.png 26 November, 2024 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్ జోష్

26-11-2024 12:54:27 AM

మళ్లీ 80వేలు దాటిన సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా లాభాల్లో మొదలైంది. నిఫ్టీ సైతం 300 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభం కాగా.. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 80,193.47 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 79,765.99 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 80,473.08 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.

చివరకు 992.74 పాయింట్లపైగా 80,109.85 వద్ద ముగిసింది.నిఫ్టీ 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది. దాదాపు 2,541 షేర్లు పురోగమించగా.. 1347 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఓఎన్జీసీ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ టాప్ గెయినర్స్ నిలువగా.. జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం, స్మాల్‌కాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతంపెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంకులు 2-4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక సోమవారం డాలర్‌కు రూపాయి 17 పైసలు పెరిగి 84.28 వద్ద ముగిసింది.