calender_icon.png 11 October, 2024 | 9:57 AM

పెట్రో కంపెనీలకు స్టాక్ ఎక్సేంజీలు ఫైన్

26-08-2024 12:30:00 AM

నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను నియమించని సంస్థలు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర, మహిళా డైరె క్టర్లను వాటి బోర్డుల్లో నియమించ కపోవడంతో ఇండియాలో అతిపెద్ద పెట్రో కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలతో పాటు గ్యాస్ సరఫరా కంపెనీ గెయిల్, చమురు ఉత్పాదక కంపెనీ ఆయిల్ ఇండియా, రిఫైనింగ్ కంపెనీ ఎంఆర్‌పీఎ ల్‌కు స్టాక్ ఎక్సేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు ఫైన్ విధించాయి. ఈ కంపెనీలపై జరిమానా పడటం వరు సగా ఇది ఐదో త్రైమాసికం. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నిర్ణీ త సంఖ్యలో స్వతంత్ర, మహిళా డైరె క్టర్లను నియమించనందుకు బీఎస్ ఈ, ఎన్‌ఎస్‌ఈలు విధించిన పన్ను వివరాలను ఈ కంపెనీలు వేరువేరు ఎక్సేంజ్ ఫైలింగ్స్‌లో వెల్లడించాయి.