- మన రూల్స్ మనమే పెట్టుకోలేమా?
- పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావాలి
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్,జూన్ 30 (విజయక్రాంతి): సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్‌లో న్యూ క్రిమినల్, మేజర్ యాక్ట్స్‌పై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక దేశాలు స్వాతంత్య్రం పొందిన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు చేసుకున్నాయని, అనేక విషయాల్లో సంస్కరణలను ఆహ్వానించార ని తెలిపారు.
మార్పులు జరుతున్నప్పడు దేశానికి మంచిదా కాదా? ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే ఆలోచించాలి సూచించారు. గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదని హితువు పలికారు. మార్పు చేసిన చట్టాలు అందర్ని దృష్టిలో చేసినట్లు చెప్పారు. ఇంకా కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకు రావాల్సిఉందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా మనం బ్రిటీష్ చట్టాలనే అనుసరిస్తున్నామని, వాటిని ఎందుకు కొనసాగించాని ప్రశ్నించారు. మనకు స్వయంగా చట్టాలను తయారు చేసుకునే సామర్థ్యం లేదా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ కచ్చితంగా దేశానికి మంచి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.