calender_icon.png 12 February, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీఎఫ్ టీంలు జీహెచ్‌ఎంసీని జల్లెడ పట్టాలి

11-02-2025 11:30:30 PM

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు ఎస్టీఎఫ్ టీంలు జీహెచ్‌ఎంసీని జల్లెడ పట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో ఎస్టీఎఫ్ ఎ, బి, సి, డీ టీంలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ జరిపే దాడులకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నుంచి పూర్తి సహకారముందన్నారు.

నింధితులను పట్టుకోవడమే లక్ష్యంగా దాడులు నిర్వహించాలని సూచించారు. ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయం తగ్గిందని, శేర్‌లింగంపల్లిలో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ మేరకు ఎస్టీఫ్ టీంలు పూర్తి నిఘా ఉంచాలని సూచించారు. ఎస్టీఎఫ్ టీం లీడర్లు అంజిరెడ్డి, ప్రదీప్‌రావు, వెంకటేశ్వర్లు, తిరుపతియాదవ్‌ల టీంల పురోగతిపై సమీక్షించారు. పలువురికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, ఎస్పీ భాస్కర్‌తో పాటు ఎస్టీఎఫ్‌సీఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.