* 150 ఏళ్ల నాటిదిగా అంచనా
సంభాల్, డిసెంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మరో కట్టడం బయటపడింది. పట్టణంలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతలో సర్వే చేస్తుండగా ‘మెట్ల బావి’ని అధికారులు కనుగొన్నారు. మెట్ల బావి లోతు 250 అడు గులు ఉన్నట్లు తెలిపారు. దీని విస్తీర్ణం 400 చదరపు మీట్లర్లుగా ఉందని పేర్కొన్నారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉన్నాయని తెలిపారు. ఈ బావి దాదాపు 150 ఏళ్ల క్రితంగా గుర్తించారు.1857 తిరుగుబాటు సమయంలో దీనిని నిర్మిం చినట్లు భావిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం “రాణి కీ బావడి” అనే మెట్ల బావిని కనుగొన్నారు.