09-04-2025 01:45:56 AM
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల,ఏప్రిల్ 8 : వచ్చే వానకాలం నాటికి పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మద్దూరు మండలంలోని లద్దునూరు గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ నల్ల నాగుల శ్వేతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం నాటికి లద్దునూరు, బొమ్మకూరు, తపస్ పల్లి రిజర్వాయర్లకు స్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులకు నిరంతరాయంగా సాగునీరు అందివ్వడానికి అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ సిబ్బంది తమకు రావలసిన బకాయిల కోసం 34 రోజులపాటు సమ్మె చేయడం వల్లనే సాగునీరు సరఫరా లో అంతరాయం ఏర్పడిందన్నారు. సాగునీరు సమస్య తలెత్తడానికి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే కారణమన్నారు.
నీటి లీకేజీ కారణంగా పంట కాలంలో నీరు నిల్వకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారిందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం వచ్చిన వెంటనే లోడింగ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలోపిఎ సి ఎస్ చైర్మన్ జీవన్ రెడ్డి తో పాటు స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మద్దూరు మండల కేంద్రంలోగల తాజ్ గార్డెన్ లో ఎల్కతుర్తి సభ సన్నాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.