calender_icon.png 9 January, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు

22-08-2024 12:00:00 AM

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి :

భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు 2047లో దేశవ్యాప్తం గా జరుపుకోవడానికి ప్రజలు ఉత్సాహం గా ఎదురు చూస్తున్నారు. ఆనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రపంచ అ గ్రదేశాల సరసన నిలవడానికి, మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తియుక్తులు కలిగిన భారతంగా సమగ్ర సుస్థిరాభివృద్ధికి బాటలు వే యడానికి నవ్యదారులు అన్వేషిస్తూ, అడ్డంకులు, ప్రతికూలతలను అధిగమిస్తూ వడి వడిగా కార్యాచరణ అమలు చేయడంలో మోదీ 3.0 నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వం సఫ లం కావాలని సగటు భారతీయ పౌరులు కోరుకుంటున్నారు.

ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ అనుకూల, ప్రతికూల బంధనాలు, రాజకీ య అవసర ప్రణాళికలు, సుస్థిరాభివృద్ధి పథకాల అమలు అంశాలను సమ్మిళితం చేస్తూ స్మార్ట్ ఆలోచనలతో సాగడం నేటి అవసరంగా కనిపిస్తున్నది. ఉక్రెయిన్ --రష్యా, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలతో సరఫరా శృంఖలాలు సడలిన వేళ రాను న్న ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రగతి పథా న నడవడానికి వినూత్న ఆలోచనలు చే స్తూ, అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతూ సంతులిత అభివృద్ధిని సుసాధ్యం చేయా ల్సి ఉన్నది. అనాదిగా దేశాన్ని పట్టి పీడిస్తూన్న పలు ప్రధాన సమస్యలకు చరమ గీతం పాడాల్సిన అగత్యం ఏర్పడింది. 

సవాళ్లను -అధిగమించాలి

గత పదేళ్లుగా మోదీ నేతృత్వ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అందించిన ఉచిత వంటగ్యాస్, ఆహార ధాన్యాల పంపిణీ, మ రుగుదొడ్ల సౌకర్యం, అర్హులైన పేదలకు గృ హ నిర్మాణాలు, తాగునీటి సరఫరా, రోడ్డు నిర్మాణాలు లాంటి అంశాల్లో ముందడు గు వేయడంతో పేదరికం గణనీయంగా త గ్గడం గమనించాం. ఇదే క్రమంలో మోదీ 3.0 ప్రభుత్వం రెట్టించిన పట్టుదలతో సవాళ్లను అధిగమించడానికి కృషి చేస్తేనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి భారత్ సగర్వంగా చేరగలుగుతుంది. నేటి డిజిటల్ భారతం వేగంగా ఆ ర్థికాభివృద్ధి చెందుతూ జీడీపీ 8 శాతాన్ని దాటి పరుగిడడం హర్షదాయకం. సంక్షేమ ఉచితాలు, సుస్థిర ప్రగతి పథకాల మధ్య సమతుల్యత సాధిస్తూ యువభారత ఉ ద్యోగ, ఉపాధుల కలల్ని సాకారం చేసుకు నే విధంగా ప్రభుత్వాలు పథక రచన చే యాల్సి ఉంది. నేటి స్మార్ట్ యుగ భారతీ య యువత విద్య, నైపుణ్యాల రెక్కలు తొడుక్కొని ఆకాశమే హద్దుగా ఎగరడానికి అవసర ఇం‘ధనం’ అందించాలి. 

నైపుణ్యాలు వృద్ధిపరచుకోవాలి

తాజా ఆర్థిక సర్వే వివరాల ప్రకారం ని రుద్యోగులు దినదినం పెరుగుతున్నారు. ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉ ద్యోగాలకు అవసరమైన ఉన్నత విద్య, వి ద్యకు తగిన నైపుణ్యాలు కొరవడుతున్నా యి. నిరుద్యోగ భూతాన్ని తరమడానికి ప్ర తి ఏటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలు భ ర్తీ చేయాల్సి ఉంది. విద్యాబుద్ధులు, అవస ర ఉద్యోగ సాధన నైపుణ్యాలు కలిగిన యు వతను ఆకర్షణీయ వేతనంతో కూడిన ఉద్యోగాలు ఆహ్వానిస్తున్నాయి. యువశక్తిని అంతర్జాతీయ స్థాయి నైపుణ్యయుక్తిగా మార్చడమే మన ముందున్న అతిపెద్ద అత్యవసర సవాలు అని తెలుసుకోవాలి. నేటి ఉన్నత విద్యాసంస్థలు డిగ్రీలు ప్రదా నం చేసే కేంద్రాలుగా మాత్రమే పని చేస్తున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నా యి.

రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు నిర్వీర్యమై చాలాకాలం అయింది. యూనివర్సి టీలను గాడిలో పెట్టడం అసాధ్యంగా తో స్తున్నది. దాదాపు 25 శాతం వరకు 14 ఏండ్ల భారత కౌమార యువత 2వ తరగతి ప్రాంతీయ భాష పుస్తకాలు, సాధారణ సరళ గణిత పరిజ్ఞానాల్లో విఫలమవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చే స్తున్నాయి. అర్హత కలిగిన యువతరం కొర త కలిగిన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో నిలుస్తున్నది. నైపుణ్య విద్య సం పన్న యువత కొరత కూడా అధికంగా ఉందని 80 శాతం బహుళ జాతి కంపెనీ లు విచారం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ఓవైపు లక్షలాది ఉద్యోగాలు నైపుణ్య యు వత కోసం నిరీక్షిస్తుండగా, మరోవైపు సరై న అర్హతలు లేని నిరుద్యోగ యువత హాహాకారాలు అనునిత్యం మిన్నంటుతున్నాయి. 

పాలనలో పారదర్శకత రావాలి

ఎక్కడ చూసినా అవినీతి కోరలు కాటే య చూస్తున్నాయి. అధికారంలో ఉన్న పౌ రుల్లో దేశభక్తి, తగు విద్యార్హతలు మాయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి స్కామ్‌లు తగ్గాయని, పాలన నిబద్ధ్దత పెరిగిందని మోదీ వివరిస్తున్నప్పటికీ నీట్ పరీక్ష లీకులు, పూజా ఖేడ్కర్ దొడ్డిదారిలో ఐఏఎస్ అభ్యర్థిగా ఎంపిక కావడం లాంటి స్కామ్‌లు మనల్ని వెక్కిరిస్తున్నాయి. దేశాభివృద్ధికి దోహదపడే ప్రధాన అంశాల్లో అ వినీతి రహిత పాలన అందించడం ముఖ్యమైంది. యువభారతానికి అర్హతనుబట్టి అ వకాశాలు, సేవలు అందాలి. లంచావతారుల దుశ్చేష్టలను తుదముట్టించాలి. ప్రభు త్వ పాలన పారద్శకంగా, అవిచ్ఛిన్నంగా కొనసాగాలి. 

సాగుబడి లాభసాటి కావాలి

ఆధునిక అంచనాల ప్రకారం 2023-- వ్యవసాయ జీడీపీ కేవలం 1.4 శా తం మాత్రమే నమోదైంది. దేశ శ్రామిక శక్తి 45.8 శాతం వరకు వ్యవసాయం లేదా దాని అనుబంధ రంగాల్లోనే నిస్సహాయం గా మగ్గుతున్నది. నిరుద్యోగ యువత ‘నష్టాల సాగుబడి’ని ఇష్టపడడం లేదు. నిరుపేదలు నెలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలతో అర్ధాకలితో నిస్సహాయంగా కాలం గడుపుతున్నారు. కాలానుగుణ అత్యవసర వ్యవసాయ సంస్కరణలకు అవకాశం ఇవ్వడం లేదు. వ్యతిరేక శక్తులు కుయుక్తులు పన్నుతూ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఉన్నత డిగ్రీలు కలిగిన నిరుద్యోగ యువత గ్రామాలు వదిలి పట్టణ కూలీలుగా అవతారం ఎత్తడం విచారకరం, ఆక్షేపణీయం. సాగుబడి లాభాలను ఇచ్చే ఆకర్షణీయ నవ్యరంగం కావాలి. 

ఇంకెన్నో సమస్యలు..

1947లో భారత పౌరుల తలసరి విద్యుత్ వినియోగం 16 యూనిట్లు మాత్రమే ఉండేది. 2023లో తలసరి శక్తి వినియోగం 1,327 యూనిట్లకు పెరగడం గొప్ప అభివృద్ధి సూచికగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ మన విద్యుత్ రంగంలో నెలకొన్న అలసత్వం, అవినీతి, చౌర్యం, సరైన మౌలిక వనరులు లేకపోవడం లాంటి కారణాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోల్చితే ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు విపరీతంగా నమోదు కావడం దురదృష్టకరం. నిరుపయోగంగా తుప్పు పడుతున్న ఖరీదైన జనరేటర్లు, ఇన్వర్టర్లు మన విద్యుత్తు శాఖ అసమర్థతను వెక్కిరిస్తున్నాయి. 

విదేశీ పెట్టుబడిదారులు దేశ సంపదను అధికారికంగా పట్టపగలు దోచుకునే కుయుక్తులు పన్నుతున్నారు. అనేక సందర్భాల్లో సఫలం కూడా అవుతున్నారు. న్యాయశాఖ పని ఒత్తిడితో నీరసపడుతున్నది. న్యాయం అందడానికి జీవితకాలం పడుతున్నది లేదా మరణానంతరం లభిస్తున్నది. 2024 వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రకాల కోర్టుల్లో 5.1 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 1,80,000 కేసులు గత 30 ఏళ్లకు పైగా బీరువాల్లో మాత్రమే దుమ్ముపట్టి మూలుగుతున్నాయి. చైనా,- భారత్ మధ్య 118 బిలియన్ డాలర్ల వాణిజ్య వ్యాపారం జరుగుతున్నది. ఇందులో భారత ఎగుమతులు 16.67 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, 100 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులు ఉండడం గంభీర సమస్యగా తీసుకోవాలి. ఇలాంటి చైనా ‘చిక్కుముడి’ నుంచి బయట పడడానికి నేటి భారతం ప్రతిన బూనాలి. చైనా వాణిజ్య ఆధిపత్యం ఇలాగే పెరిగితే భారతదేశ భద్రతకుకూడా ముప్పు వాటిల్లే ప్రమాదమూ ఉందని గమనించాలి.  

దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల చిట్టా పెద్దది. వాటిని అధిగమించడానికి 141 కో ట్ల భారతీయులు, ముఖ్యంగా యువతీ యువకులు కంకణబద్ధులు కావాలి. తమ దేశాన్ని తామే అభివృద్ధి చేసుకోవాలి. తా ము ఎదుగుతూ దేశ ఎదుగుదలకు దోహదపడాలి. ‘ఆప్ బడో.. దేశ్‌కో బడావో’ ని నాదం యువభారతంలో మారుమోగాలి. 

 -వ్యాసకర్త సెల్: 9949700037