calender_icon.png 21 April, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరానికి చకచకా అడుగులు

13-12-2024 12:46:04 AM

  1. సంగారెడ్డి జిల్లాలో 646 పంచాయతీలు, 5,718 వార్డులు
  2. 5,732 పోలింగ్ కేంద్రాల గుర్తింపు
  3. 650 మందికి ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాట్లు
  4. అభ్యంతరాల అనంతరం తుదిజాబితా: కలెక్టర్

సంగారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభు త్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీలు, ఇదివరకే ఉన్న జీపీలలో వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్దం చేశారు.

సంగారెడ్డి జిల్లాలో 4 రెవె న్యూ డివిజన్‌లు, 3 పంచాయతీ డివిజన్‌లు, 27 రెవెన్యూ మండలాలు, 25 మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఇదివరకు మొత్తం 647 గ్రామ పంచాయతీలు ఉండ గా, తాజాగ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 11 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 658కి చేరగా అందులోని ఓ గ్రామ పంచాయతీని కామారెడ్డి జిల్లాలో విలీనం చేశారు.

దీంతో జిల్లాలో జీపీల సంఖ్య 657కు చేరింది. అయితే ఈ 657 జీపీల్లోని 11 పాత పంచాయతీలను అమీన్‌పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో కలపగా చివరకు మొత్తం 646 పంచాయతీలు ఉన్నాయి. దీంతో 646 పంచాయ తీలు, 5,718 వార్డులలో ఎన్నికల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాంగా ఇప్పటికే జిల్లాలో 5,732 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.

జిల్లా పరిధిలోని జీపీల్లో మొత్తం ఓటర్లు 8,51,420 ఉండగా అందులో పురుష ఓటర్లు 4,23,629, మహిళా ఓటరలు 4,27,739, ఇతరులు 52 మంది ఉన్నారు. పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌లో అదనంగా 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 650 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. 

మున్సిపాటీల్లో విలీనం చేసిన గ్రామాలు

పటాన్‌చెరు మండలంలోని ఐదు గ్రామాలు.. ముత్తంగి, పోచారం, కర్ధనూర్, పాటి, ఘనపూర్‌ను తెల్లాపూర్ మున్సిపాటీలో విలీనం చేశారు. అమీన్‌పూర్ మండ లంలోని ఆరు గ్రామాలు.. ఐలాపూర్, ఐలాపూర్ తండా, కృష్టారెడ్డి పేట్, పటేల్‌గూడ, దాయర, సూల్తాన్‌పూర్‌ను అమీన్‌పూర్ మున్సిపాటీలో విలీనం చేశారు. 

కొత్తగా ఏర్పాటు చేసిన జీపీలు.. 

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 గ్రామా పంచాయతీల వివరాలు.. నాగల్‌గిద్ద మండలంలో.. వట్‌పల్లి, ఆందోల్, రాయికోడ్, న్యాల్‌కల్, సదాశివపేట, నారాయణ ఖేడ్, సిర్గాపూర్ ఉన్నాయి. సదాశివపేట మండంలో.. ముబారక్‌పూర్(బి), ఆందోల్ మండలంలో.. కొండారెడ్డిపల్లితండా, వట్‌పల్లి మండలంలో..

లక్యా నాయక్‌తండా, రాయికోడ్ మండలంలోని ఎన్కెపల్లి, న్యాల్‌కల్ మండలంలో.. తాట్‌పల్లి, నారాయణ ఖేడ్ మండలంలో.. హనుమన్ మందిర్ తండా, తింగాయనాయక్ తండా, గుండుతండా, సిర్గాపూర్ మండలంలో.. పాఠ్యనా యక్ తండా, నాగల్‌గిద్ద మండలంలో ఉమలతండా, శ్యామా నాయక్ తండాను గ్రామా పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. 

650 మందికి ఒక పోలింగ్ కేంద్రం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి 650 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ జీపీ కార్యాలయంలో ఇప్పటికే తుది ఓటరు జాబితాను అందుబా టులో ఉంచారు. అలాగే పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ సౌకర్యా లు కలిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అభ్యంతరాల అనంతరం తుదిజాబితా

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన జీపీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన జీపీల అనంతరం మొత్తం 646 జీపీలు ఉన్నాయి. ఓటర్‌కు రెండు కిల్లోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

ఇప్పటికే జిల్లాలోని అన్ని జీపీల్లో ఓటరు జాబితా, ముసాయిదా పోలిం గ స్టేషన్ల జాబితాను అందుబాటులో ఉంచాం. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయలను తీసుకున్నాం. అభ్యంత రాల అనంతరం తుది జాబితాను ప్రచురిస్తాం.

  క్రాంతి వల్లూరు,

కలెక్టర్, సంగారెడ్డి