calender_icon.png 4 April, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు

03-04-2025 12:00:00 AM

  • మిల్లెట్ బిస్కెట్ పరిశ్రమతో స్వయం ఉపాధి

ఆదర్శంగా నిలుస్తున్న ఆదివాసీ మహిళలు

ఆదిలాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళలు ఆర్థ్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. తాము స్వయం ఉపాధిని పొం దడమే కాకుండా పలువురికి ఉపాధిని కల్పి స్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారుల ప్రోత్సహంతో.. చిరుధాన్యాల బిస్కెట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పి తమ స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్నా రు ఇక్కడి గిరిజన మహిళలు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని పలువురు గిరిజన మహిళలు సంఘటితమై స్వ శక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఐదుగురు సభ్యులు కలిసి ‘ఇంద్రాయి మహిళ సంఘం’గా ఏర్పడ్దారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఇంద్రాయి మహిళా సమాఖ్య కార్యాలయంలోని ఓ భాగంలో చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పి స్వయం  ఉపాధికి బాటలు వేసుకున్నారు.

ప్రత్యేక శిక్షణ తీసుకుని, యంత్ర సామాగ్రిని సైతం సమకూర్చుకునని జొన్న లు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇతర చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. జిల్లా గ్రామీణా అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో  అందించిన ఆర్థిక తోడ్పాటును ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమను జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ఇటీవల ప్రారంభించారు.

చిరుధాన్యాలను వేరు వేరుగా పిండి మరలో వేసి పిండిగా పట్టుకుంటారు. తర్వా త ఆ పిండిలో బెల్లం, బట్టర్, తగినంత బేకిం గ్ సోడా, వెనీలా లిక్విడ్, బిస్కెట్ సాల్ట్ తగినన్ని నీళ్లు పోసి కలిపి, ఆ పిండిని కోల తో వెడల్పుగా చేసి ఆ తర్వాత బిస్కెట్ సైజ్ సమానంగా వచ్చేలా శాంచతో తయారు చేసి, వాటిని విడివిడిగా ట్రేలలో పెట్టి వాటిని ఓవెన్‌లో పది నిముషాల పాటు ఉంచుతా రు.

తర్వాత బయటకు తీస్తారు. అంతే ఇక మిల్లెట్ బిస్కెట్ రెడీ.  ఆపై ట్రైలను బయటకు తీసి బిస్కెట్‌లను ప్యాకింగ్ కవర్‌లలో కావాలిసినంతగా వేయింగ్ మిషన్‌పై పెట్టీ ప్యాకింగ్ చేసి వాటికి తమ యూనిట్‌కి సంభందించిన స్టిక్కర్లను వేసి ప్యాక్ చేస్తారు. 

ఒక్కో రకమైన బిస్కెట్‌లను 100, 200 గ్రాముల ప్యాకెట్‌లు  చేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మరింత తోడ్పాటును అందిస్తే గిరిజన ఆశ్రమ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ బెస్కెట్లను సరఫరా చేస్తామంటున్నారు మహిళా సంఘం అధ్యక్షురాలు మెస్రం లలిత.  ఈ గిరిజన మహిళలను ఆదర్శంగా తీసుకొని ఏజెన్సీలోని మరికొంత మంది ముందుకు రావాలని ఆశిద్దాం.