calender_icon.png 28 September, 2024 | 8:57 PM

డీజే బ్యాన్ దిశగా అడుగులు

27-09-2024 02:31:04 AM

  1. ‘కమాండ్ కంట్రోల్’లో సీపీ అధ్యక్షతన సమీక్ష
  2. మూడు కమిషనరేట్ల పోలీసు అధికారులు హాజరు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): డీజేల విషయంలో త్వరలో గైడ్‌లైన్స్ జారీ చేస్తామని డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రారంభించారు. హైదరా బాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కం ట్రోల్ సెంటర్‌లో పోలీస్ ఉన్నతాధికారులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఆధ్యాతిక సంఘాల ప్రతినిధులు పాల్గొ న్నారు.

డీజే శబ్దాలపై అనేక ఫిర్యా దులు వస్తున్నాయని, భారీ సౌండ్స్‌తో నివాసాల్లో వయసు మీరి న వారు ఇబ్బంది పడుతున్నారని సీపీ ఆనంద్ సమావేశంలో ప్రస్తావించారు. పెద్ద శబ్దాల కారణంగా వృద్ధులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికే తమకు వేలాదిగా ఫిర్యా దులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికా రులు, మత సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అందరి అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని, తర్వాత ప్రభుత్వం డీజేపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.