calender_icon.png 22 February, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి ఒప్పందం దిశగా అడుగులు

18-02-2025 01:18:54 AM

యూఏఈ చేరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

దుబాయ్, ఫిబ్రవరి 17: మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ము గింపు పలకనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా లో శాంతి చర్చలు జరపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి యూఏఈ చేరుకున్నారు. 

శాంతి సన్నాహక చర్చలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్‌కోఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్జ్ సౌదీకి ప్రయాణమయ్యారు. అయితే ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు చేపడుతున్నారంటూ అమెరికా మిత్రదేశాల నుంచి ఆరోపణ లు రావడంపై ట్రంప్ స్పందించారు.

యుద్ధాన్ని ముగించే ప్రతీ చర్చలోనూ జెలెన్ స్కీ భాగస్వామిగా ఉంటారని ట్రంప్ పేర్కొన్నారు. వీలైనంత తొందరగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ సమావేశమవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్చల నేపథ్యంలో ఈయూ దేశాలు సోమవారం పారిస్‌లో అత్యవసర సమావేశంలో పాల్గొన్నాయి.