- గ్రామ పంచాయతీ భవన నిర్మాణం భూమి పూజలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్, జనవరి 19 (విజయక్రాంతి): గత పదేళ్ళ పాలనలో నిర్వీర్యమైన గ్రామపంచా యతీ వ్యవస్థను మళ్లీ పటిష్ట పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం నాగదేవుపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటూ రాజకీయాలకు అతీతంగా పాలించే గ్రామపంచాయతీ వ్యవస్థను గత పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలకులు పూర్తిగా నిర్వీర్య పరచా లని తిరిగి పంచాయతీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు.
అన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గుర్తు చేశారు. వారితో పాటు తాడూర్ పిఏసిఎస్ ఛైర్మన్ రామచంద్ర రెడ్డి, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.