29-03-2025 12:04:34 AM
కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్
ముషీరాబాద్, మార్చి 28: (విజయక్రాంతి) : డివిజన్‌లో డ్రైనేజీ సమ స్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బాలు ముదిరాజ్ గల్లీలో నూతన డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ మాట్లాడుతూ బాపూజీ నగర్ బాలు ముదిరాజ్ గల్లీ లో డ్రైనేజీ సమస్యతో స్వస్తివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్తీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీంతో అధికారుల తో మాట్లాడి డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అధికారులు, వాటర్ వరక్స్ అధికారి సురేష్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, నాయకులు అనిల్, బాలు, లక్ష్మణ్, మహేష్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.