calender_icon.png 15 November, 2024 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు

15-11-2024 12:37:10 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) :  రాష్ర్ట రైతుల చిరకాల ఆకాంక్ష అయిన పసుపు బోర్డును కేంద్రం సహకారంతో ఏర్పాటు చేసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ర్టంలో పసుపు పండించే జిల్లాల్లో నిజామాబాద్ ప్రధానమైనదని.. అక్కడి రైతులు పదేళ్లుగా పసుపు మద్దతు ధర ఇవ్వాలని, జాతీయ పసుపు బోర్డు ఎదు రు చూస్తున్నట్లు గుర్తు చేశారు. పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పా టు చేస్తే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

రాష్ర్టంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగవుతుండగా.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 1,757 ఎకరాలు, ఖమ్మం జిల్లా లో 696 ఎకరాల్లో సాగవుతున్నాయన్నారు. కొబ్బరితోటల అభివృద్ధికి గా నూ భద్రాద్రిలో రీజనల్ కొకనట్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పాం సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.  రాష్ట్రంలో ప్రాంతీయ ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.