నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) రాష్ట్ర మంత్రులకు విన్నవించారు. బుధవారం హైదరాబాదు నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మంత్రులు సీతక్క(Minister Sitakka) కొండా సురేఖ(Minister Konda Surekha) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నిర్మల్ నుండి కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలను సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసే విధంగా జిల్లా అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయలక్ష్మి, అంబాజీ నాయక్ తదితరులు ఉన్నారు.