calender_icon.png 27 December, 2024 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు చర్యలు

27-12-2024 02:52:24 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నల్లగొండ, డిసెంబర్ 26 (విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం లో రూ.70 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ భవనంతోపాటు గోదామును ఎంపీ చామల కిరణ్‌కు మార్‌రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీటికి ఢోకా లేకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని 120 చెరువులను నింపామని తెలిపారు. ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఏడాదిలోనే రైతులకు 54 వేల కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు.