25-03-2025 12:52:24 AM
జగిత్యాల అర్బన్, మార్చి 24(విజయ క్రాంతి): వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న నల్ల ఎల్లారెడ్డి,ఏలేటి రాజిరెడ్డి ల మొక్కజొన్న పంటలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దని,అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెను వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రైతు నాయకులతో మాట్లాడానని, పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగిందని, రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ల దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 21 వేల కోట్ల రైతు రుణమాఫీ,4 ఎకరాలకు రైతు భరోసా అమలు చేయడం జరిగిందని, లక్ష్మి పూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ అతి త్వరలో పూర్తి అవుతుందని గత ప్రభుత్వ హయంలో నిధుల కొరతతో కొంత ఆలస్యం అయిందని అన్నారు.కౌలు రైతులు,రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ముస్కు ఎల్లారెడ్డి,గడ్డం నారాయణ రెడ్డి,నక్కల రవీందర్ రెడ్డి, చెరుకు జాన్,బాల ముకుందం,సత్తి రెడ్డి, పురిపాటి రాజిరెడ్డి, ఏవో తిరుపతి, ఏ ఈ ఓ హరీష్ తదితరులు పాల్గొన్నారు.