కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన కళాయాత్రను మంగళవారం కలెక్టర్‌ప్రారంభించారు. ఆయన మాట్లాడు.. ఈనెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, మున్సిపాలిటీలు, 21 మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల జీవన విధానాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం అవలంభిస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి పాలనా యంత్రాంగం నిరంతర కృషి చేస్తుందని పేర్కొన్నారు. డీపీఆర్‌వో రామచంద్రరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం, సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.