calender_icon.png 18 April, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దవాఖాన ఏర్పాటుకు చర్యలు

10-04-2025 12:35:49 AM

ఎంపీ ఎం.అనిల్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): బాపూజీ నగర్‌లో స్థానిక ప్రజల సౌకర్యార్థం త్వరలో బస్తీ దవఖాన ఏర్పాటు చేస్తామని రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాద వ్, సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి తమకొండ రాజ్ దీప్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను కలిసి బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్లో బస్తీ దవఖాన ఏర్పాటు చేయాలని కోరారు స్థానికంగా పేద ప్రజలు అధికంగా నివసిస్తున్నందున వారికి దవాఖాలను అందుబాటు లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

వెంటనే స్పందించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిందని అన్నారు. ప్రతి బస్తీలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పా టు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకుడు రమేష్ గౌడ్, పీటర్ తదితరులు పాల్గొన్నారు.