calender_icon.png 20 March, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాలలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు

13-03-2025 11:15:24 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అంగనవాడి కేంద్రాలలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం  ఆసిఫాబాద్ మండలం కౌటగూడ, జనకాపూర్  అంగన్వాడి  కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అంగనవాడి కేంద్రాలలో భవనాల మరమ్మత్తు పనులు, త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి.చేయాలని తెలిపారు. పనులలో నాణ్యత పాటించాలని, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో నమోదయి ఉన్న గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రానికి మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధమైన మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వేసవికాలం దృష్ట్యా పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని తెలిపారు. అంగన్వాడి భవన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రాజెక్టు అధికారులు, సూపర్ వైజార్లు లో నిరంతరం తనిఖీలు చేపట్టాలని, అంగన్వాడి కేంద్రాలలో సరుకులను చెడిపోకుండా రక్షించుకోవాలని, కాలం చెల్లిన పదార్థాలను ఉపయోగించకూడదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా పోషణ్ అభియాన్ సమన్వయకర్త గోపాలకృష్ణ, సూపర్వైజర్లు లైలా, పెంటు బాయి, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.