calender_icon.png 5 March, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాల్ కోట సుందరీకరణకు చర్యలు

05-03-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల, మార్చి 4 (విజయక్రాంతి): గద్వాల్ కోట, లింగంబావి స్టెప్‌వెల్‌ను పునరుద్ధరించి, సుందరీకరణకు చర్యలు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గద్వాల్ కోట,లింగంబావి స్టెప్‌వెల్ ను అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గద్వాల్ కోటను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మరమ్మతులు,శుభ్రత చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

గద్వాల్ కోట, లింగమ్ బాయి స్టెప్‌వెల్ పునరుద్ధరణ కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, (%ఈఆష్ట్ర%) తయారుచేయాలని ఆర్కిటెక్ట్‌ను ఆదేశించారు. కట్టడాన్ని స్థిరంగా నిలిపేందుకు సరైన నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. లింగంబావి స్టెప్‌వెల్ పునరుద్ధరణలో భాగంగా ప్రదేశం ఆకర్షణీయంగా మారేందుకు ల్యాండ్‌స్కేపింగ్ పనులు చేపట్టాలని సూచించారు.

రైలింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రతను పెంచాలని, అలాగే రోజువారీ శుభ్రత, నీటి పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యలు పురాతన నీటి నిల్వ వ్యవస్థను రక్షించడంతో పాటు,శుభ్రతను పెంచి మంచి పర్యావరణాన్ని అందిస్తాయని అన్నారు.

ఈ పునరుద్ధరణ పనులు ప్రాంతీ య వారసత్వ సంరక్షణ,నీటి వనరుల మెరుగుదల, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఆర్కిటెక్ శ్రీ లేక,వర్డ్ ఆఫీసర్స్ ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.