జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నుండి ఆసిఫాబాద్ పట్టణానికి వచ్చే దారిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో సోమవారం కలెక్టర్ నేషనల్ హైవే మేనేజర్ రంజన్ కుమార్, ఆర్డిఓ లోకేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ రోడ్డు నుండి పట్టణానికి వచ్చే దారిలో మూలమలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నయని తెలిపారు. మూలమలుపు వద్ద ఉన్న ఎత్తైన ప్రాంతాన్ని చదును చేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. భారత్ పెట్రోల్ పంపు సమీపంలో ఉన్న యూటర్న్ ను మూసి వేయించాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. సాయిబాబా ఆలయ సమీపం నుండి నేషనల్ హైవే వరకు అప్రోచ్ రోడ్డుపై బీటీ వేయాలని సూచించారు. రోడ్డు వెడల్పులో సమాధులు కోల్పోవుతుండడంతో వారి పేరున మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.