21-04-2025 10:17:28 PM
కాటారం,(విజయక్రాంతి): కాటారం మండల పరిధిలోని వివిధ చెరువులను రాత్రికి రాత్రే చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా యాక్ట్ 1905ని ఉల్లంఘిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువులను చేరబడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఆరోపించారు. చెరువులను చెరబడుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. సుమారు ఇప్పటివరకు మూడు కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ చేసే మట్టిని తరలించారని, దీని ద్వారా చెరువులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని అన్నారు.
కాటారం పరిధిలోని పోతులవాయ్ శివారులోని నల్ల గుంట, విలాసాగారం శంకరంపల్లి , దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, తక్షణమే మట్టిని దోపిడీ చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి చెరువుల పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించి మట్టిని దోచుకుంటున్న వారిపై చట్టపరమైన కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాటారం తహసిల్దార్ కి ఇచ్చిన వినతి పత్రంలో తెలిపినట్లు ఆయన తెలియజేశారు. అధికారులు పట్టించుకోకపోతే చెరువుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి తిరుపతి, బొడ్డు కిషో,ర్ రజనీకాంత్, నరేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.