29-04-2025 08:35:12 PM
తాడ్వాయి (విజయక్రాంతి): మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి(District Panchayat Officer Murali) అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్యదర్శులు, కారోబారులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని గ్రామాల్లో ఎక్కడెక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయో గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేరకంగా గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపిఓ అధికారులు పాల్గొన్నారు.