30-04-2025 12:51:45 AM
తాడ్వాయి, ఏప్రిల్ 29: మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి అధికారులను ఆదేశించారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్యదర్శులు, కారోబారు లతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మండలంలోని గ్రామాల్లో ఎక్కడెక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయో గుర్తిం చి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు అదే రకంగా గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపిఓ అధికారులు పాల్గొన్నారు.