24-03-2025 12:10:03 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,మార్చి23(విజయక్రాంతి): గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో వేసవికాలంలో చొప్పదండి నియోజకవర్గం లో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రానున్న వేసవికాలం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారుల చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్రాగునీటికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది సమన్వయంతో పనిచేసి త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో అవసరం ఉన్నచోట బావుల త్రవ్వకం, బోర్ వెల్స్ వేయించడం, నూతన పైప్ లైన్లు వేయడం, గేట్ వాల్వులు, పైప్ లైన్లో మరమ్మత్తు చేయడం, బోర్ల ఫ్లషింగ్ వంటి వాటిని పూర్తి చేయడానికి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాలకు చెందిన మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు పాల్గొన్నారు.