calender_icon.png 2 April, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద చెరువులోకి డ్రైనేజీ నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలి

25-03-2025 12:56:51 AM

జీహెచ్‌ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహరెడ్డి 

ఎల్బీనగర్, మార్చి 24 : మన్సూరాబాద్ డివిజన్‌లోని  పెద్ద చెరువులోకి ఎంతో కాలంగా  వస్తున్న డ్రైనేజీ నీళ్లకు అడ్డుకట్ట వేయాలని జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్‌పాటిల్‌ను జీహెచ్‌ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్‌లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి కోరారు.

సోమవారం  పెద్ద చెరువు అసోసియేషన్ సభ్యులతో కలిసి బల్దియా జోనల్‌ఆఫీస్‌కు వెళ్లి జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు.  ఈ సందర్భంగా  కొప్పుల మాట్లాడుతూ..  చెరువులో ఉన్న సమస్యలను కమిషనర్ వివరిస్తూ  ఎఫ్‌టీఎల్ చెరువు పైన ఉన్న కోర్టు కేసు వల్ల కాలువకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోతే..  చెరువులో ఎస్టీపీ  పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు. 

దీంతో సమస్య పరిష్కారం అవడంతో పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కమిషనర్ కు వివరించారు. చెరువులోకి వచ్చే  గ్రౌండ్ వాటర్ తో దాదాపు 60 నుంచి 70 కాలనీలకు భూగర్భ నీటి వనరులు పెరుగుతాయని వివరించారు. సమస్య పరిష్కార దశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

డివిజన్‌లో మరో ఓపెన్‌జిమ్‌ఏర్పాటు చేయాలని  కోరగా... కమిషనర్ సానుకూలంగా స్పందించారని కొప్పుల నర్సింహరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో పెద్ద చెరువు అసోసియేషన్ సభ్యులు వేమారెడ్డి, వెంకట్ రామ్, భూమిరెడ్డి, నాంపల్లి రామేశ్వర్, పారంద సాయి తదితరులు పాల్గొన్నారు.