15-04-2025 08:22:05 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామాలలో వేసవి కాలంను దృష్టిలో ఉంచుకొని మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు తాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులపై కూలీలకు అవగాహన కల్పించి గ్రామంలో ఉపాధి హామీ ప్రారంభించాలని సూచించారు. అనంతరం మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆమె వెంట స్థానిక ఎంపీడీవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.