calender_icon.png 18 March, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

18-03-2025 06:09:29 PM

తాడ్వాయి (విజయక్రాంతి): గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రాజారామ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వేసవి వచ్చినందున వేసవిలో ఏ గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నర్సరీలో మొక్కలు బాగా పెరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, కార్యదర్శులు పాల్గొన్నారు.