calender_icon.png 23 February, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

19-02-2025 01:17:15 AM

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ సమావేశ మందిరంలో తాగునీరు, విద్యుత్ , పారిశుద్ధ్యం, తాగునీటి ట్యాంకుల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని వార్డు అధికారులకు సూచించారు.  అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని చెప్పారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, మినీ ట్యాంకులన్నింటినీ శుభ్రం చేయాల న్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు.

వనమహోత్సవం నాటిన మొక్కల ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలన్నారు. శానిటేషన్, తడిపొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అనంతరం అక్క చెలిమగుట్ట, శనేశ్వర గుట్ట  వద్ద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకులు, మునుగోడు రోడ్డులోని స్వర్గపురి హిందూపూర్ వైకుంఠధామాన్ని కలెక్టర్ పరిశీలించారు.