05-04-2025 01:00:34 AM
మేడ్చల్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికా రులకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. శుక్రవారం నేరేడుమెట్లోని సీపీ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొనే శోభాయాత్ర సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనుమానిత ప్రాం తాలు, సమస్యాత్మక ప్రాంతాలలో బాంబు తనిఖీ బృందాలతో తనిఖీ చేయించాలన్నారు. అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల బందోబస్తు పై కూడా తగు సూ చనలు చేశారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి, ఎల్బీనగర్ డిసిపిలు పద్మజ, ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాం చ్ డిసిపి నరసింహారెడ్డి, క్రైమ్ డిసిపి అరవింద్ బాబు, ట్రాఫిక్ డిసిపిలు మల్లారెడ్డి, శ్రీనివాసులు, డిసిపిలు ఉషా విశ్వనాథ్, శ్యాంసుందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.