calender_icon.png 13 March, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈఈటీలో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలి

13-03-2025 07:50:56 AM

 జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో డీ.ఈ.ఈ.టి యాప్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  డీ.ఈ.ఈ.టీ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందన్నారు.

ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన విద్యార్థులు డీ.ఈ.ఈ.టి లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ & ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగు అవుతాయన్నారు. జిల్లాలో ఉన్న ఐటిఐ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరాలను 15 రోజులలో డీ.ఈ.ఈ.టి లో నమోదయ్యే లా చూడాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు , ఇతర ఉపాధి కోర్సుల కళాశాలలో, ఎంబీఏ కాలేజి విద్యార్థులు కూడా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేట్ రంగంలోనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ లో అర్హత కలిగిన ఉద్యోగాల వివరాలు కూడా విద్యార్థులకు చేరవేసేందుకు డీ.ఈ.ఈ.టీ ఉపయోగపడుతుందన్నారు.ఈ సమావేశంలో ఏపీవో డేవిడ్ రాజు,, పరిశ్రమల శాఖ తిరుపతయ్య జనరల్ మేనేజర్, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, డిటిసిపిఓ సత్యనారాయణ, ఆర్టిఓ వెంకటరమణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.