calender_icon.png 2 February, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

01-02-2025 12:00:00 AM

వికారాబాద్, జనవరి 31 : రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిక్ జై న్ అధికారులకు సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలను రూపొందించాలన్నారు.

మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో నీతి నిల్వలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.