01-03-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ ఫిబ్రవరి 28; కోదాడ డివిజన్లో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని, నీటి సరఫరా కోరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కోదాడ డివిజన్లో మంచినీటి సరఫరా పరిస్థితిపై ఎంపీడీవోలు ,ఎంపీఓవోలు, మున్సిపల్ కమిషనర్లు, రూరల్ వాటర్ సప్లై విభాగం ఈఈ, డిఇ లు, పంచాయతీ సెక్రటరీలు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి మాత్రమే అందాలని కలెక్టర్ తెలిపారు. జడ్పి సీఈవో వివి అప్పారావు, ఆర్డీవో సూర్యనారాయణ, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ అధికారులు శ్రీని వాస్, అరుణాకర్ రెడ్డి, డిపిఓ నారాయణరెడ్డి, డిఎల్పిఓ యాదయ్య, తాసిల్దార్ వాజిద్, కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ రమాదేవి, ఎంపీడీవోలు, అధికారులుపాల్గొన్నారు.