28-02-2025 01:49:33 AM
నారాయణపేట, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): రానున్న వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ భగీరథ బడ్జెట్ పన్నుల వసూలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిషన్ భగీరథ గురించి మాట్లాడుతూ గ్రామ గ్రామాన మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా అవుతున్నాయని వచ్చే వేసవిలో కూడా అలాగే సరఫరా చేయాలన్నారు.
ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తెలుపాలని అధికారులను ఆదేశించారు. వేసవి యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ కమిషనర్లను ఆయా మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరాపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే బడ్జెట్ పై పన్నుల వసూళ్లపై మాట్లాడారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈ. ఈ.మిషన్ భగీరథ గ్రిడ్ పి.వెంకటరెడ్డి,మున్సిపల్ కమిషనర్లు మిషన్ భగీరథ అధికారులు ఏ. ఈ. డి. ఈ. లు తదితరులు పాల్గొన్నారు.