28-03-2025 01:15:09 AM
గద్వాల, మార్చి 27 ( విజయక్రాంతి ) : సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నర్సింగరావు తో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ* యాసంగి మార్కెటింగ్ సీజన్ లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్ణయించారని తెలిపారు.
ప్రస్తుతం 33 శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, అడిషనల్ పిడి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్లాట్ల క్రమబద్దీకరణకు చివరి మూడు రోజులే అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ స్కీం క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కొరకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 31 వరకు అవకాశం కల్పించిందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్ ఆర్ ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరో మూడు రోజుల గడువు మాత్రమె ఉన్నందున జిల్లాలోని అన్ని మున్సిపల్ గ్రామ పంచాయతీలలో ఫీజును చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత 25 శాతం రిబేటు వర్తించదని తెలిపారు. ఈ అవకాశం కొద్ది రోజులే ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోనాలన్నారు. చెల్లింపులు చేసిన వారికి రెండు లేదా మూడు రోజులలో అనుమతులు మంజూరు చేయబడతాయని తెలియజేశారు.