calender_icon.png 2 February, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలి

02-02-2025 12:22:59 AM

వనపర్తి, ఫిబ్రవరి 1 ( విజయక్రాంతి ) : పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఖిల్లా గణపురం మండల పరిధిలోని డీకే తండా శివారులోని తెలంగాణ మోడల్ స్కూల్ ను, ఘనపురం మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మి కంగా సందర్శించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు గుర్తించాలని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు.

వెనుకబడిన విషయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రాథమిక అంశాల నుంచి వారికి బోధించాలని చెప్పారు. ముఖ్యంగా గణితం, సైన్స్, హిందీ అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. బోర్డు పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అయ్యేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

మామిడి మాడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలన

ఖిల్లా గణపురం మండలం పరిధిలోని మామిడి గ్రామంలో పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం పూర్తి కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు.

ఉగాది పండగ లోపు ఇండ్లను నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని మండల తహసీల్దార్ కు సూచించారు. పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో వెంకటాచారి, ఎంఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.