calender_icon.png 24 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి అభివృద్ధికి అడుగులు

24-01-2025 01:39:18 AM

  • నియోజకవర్గంలో రూ.1300 కోట్లతో పలు అభివృద్ధి పనులు
  • సంగెం గ్రామంలో బ్రిడ్జీ నిర్మాణంతో నెరవేరనున్న   
  • ప్రజల 70 ఏండ్ల కలతుంగతుర్తిలో ఏరియా దవాఖానతోపాటు పలు అభివృద్ధ్ది పనులు 

తుంగతుర్తి , జనవరి 23 : తుంగతుర్తి నియోజకవర్గంలో  అభివృద్దికి అడుగులు పడుతున్నాయి. గడిచిన 20 సంవత్సరాల కాలం నుండి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన  మందుల సామేలును  కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవించి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం, ఎవరు ఊహించని విదంగా సుమారు 52 వేల మెజార్టీ పొదంటం ఒక ఎత్తయితే  ఒక సంవత్సర కాలంలో రూ. 1300 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులు చేపడుతుండటంతొ తుంగతూర్తి నియోజకవర్గంలో పదేండ్ల తరువాత అభివృద్ది దిశగా పయనిస్తోన్నది. 

 నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తిరుమలగిరిలో నూతన జూనియర్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ,అనతి కాలంలోనే జూనియర్ కాలేజ్ మంజూరు చేయించారు.

తుంగతుర్తి మండలం లోని వెంపటి గ్రామంలో ఎస్సీ కాలనీలో కరెంటు హై టెన్షన్ వైర్లతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఎమ్మెల్యే గెలిచిన మొదటి నెలలోనే పట్టుమని పది రోజులలో సంబంధిత విద్యుత్ అధికారులతో మమేకమై, ఊరి చివరగా వెళ్లేటట్లు విద్యుత్తు లైను ఏర్పాటు చేశారు. తిరుమలగిరి నుండి అడ్డ గూడూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో నూతన ఏరియా దవాఖాన నిర్మాణం కోసం సుమారు రూ.45కోట్ల నిధులతో నూతనంగా దవాఖాన నిర్మాణ పనులు కొన సాగుతున్నాయి.గడిచిన 70 సంవత్సరాల నుండి ఏ ఎమ్మెల్యే కూడా పూర్తిస్థాయిలో సంగంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోగా, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రైతుల ప్రాణాలు  కూడా నీటి ప్రవాహంలో కొట్టుకపోతుండేది.

ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో సుమారు రూ.13 కోట్ల నిధులతో ఒకపక్క బ్రిడ్జి పనులు మరొక పక్క రోడ్డు పనులు కొనసాగుతున్నం పట్ల గ్రామంలోని ప్రజలు తమ చిరకాల వాంఛ నెరవేరుతున్నట్లు ఆనందంలో ఉన్నారు. రావులపల్లీ కేతిరెడ్డి బ్రిడ్జి నిర్మాణ పనులు కాలువ పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు.

ప్రస్తుతం. నియోజకవర్గ పరంగాతిరుమలగిరి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ పాఠశాల నిర్మాణ గ్రామాల్లో సిసి రోడ్లు ,డ్రైనేజీలు, ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, గ్రామ పంచాయతీలకు నూతన బిల్డింగులు, అంగన్వాడి బిల్డింగులు, గురుకుల పాఠశాలలో పలు అభివద్ధి పనులు, నిర్మాణాలు, ప్రారంభాలు కొనసాగుతున్నాయి.

ఏది ఏమైనా ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల కోసం ఒక ప్రక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మరొక ప్రక్క సంబంధిత మంత్రులతో మమేకమై తుంగతుర్తి నియోజకవర్గ అభిఱవృద్ధి కోసం అహర్నిశలు కషి చేస్తున్నడం పట్ల ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేధావులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిడ్జి నిర్మాణంతో మా గ్రామ ప్రజల కళ నెరవేరుతుంది.

తుంగతుర్తి లో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ప్రతి సంవత్సరం మా బ్రిడ్జి దగ్గరకు వచ్చి చేస్తాం... చూస్తామని వెళ్ళి పోయారు తప్ప బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయలేదు.

దళిత బిడ్డ మొట్టమొదటిసారిగా మందుల సామేలు ఎమ్మెల్యే రాకతో ప్రత్యేక నిధులు కేటాయించి ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజల కండ్లలో ఆనందం చూడాలంటే తప్పనిసరిగా బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగి పూర్తిచేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు కతజ్ఞతలు తెలిపారు.

 కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కలకోట్ల మల్లేష్