calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరున వస్తున్న స్టీఫెన్ నెడుంపల్లి

18-03-2025 12:00:00 AM

మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘లూసిఫర్’. దీనికి సీక్వెల్‌గా ‘ఎల్2ఎంపురాన్’ రూపొందిన విషయం తెలిసిందే. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఈ హై ఆక్టేన్, స్టులిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మోహన్‌లాల్ ఖురేషీ అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా తెరపై అలరించనున్నారు.

ఇంకా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేద్కర్, శివాజీ గురువాయూర్ తదితరులు భాగమయ్యారు.

1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో రూపొందించిన ఈ సినిమా మార్చి 27న మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్; సంగీతం: దీపక్ దేవ్; ఎడిటర్: అఖిలేష్ మోహన్; ఆర్ట్: మోహన్‌దాస్; స్టంట్స్: సిల్వా.