అడుగు బయటపెట్ట.. కానీ అధికారం నాదే మాజీ సీఎం కేసీఆర్ మాటతీరు హాస్యాస్పదంగా మారింది. రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో ఫామ్‌హౌస్ దాటి తొంగిచూడని బీఆర్‌ఎస్ అధినేత.. మళ్లీ తమదే అధికారం అనడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చిల్లరగాళ్లు ఉన్నారని, పాలన చేయరాదంటూ విమర్శలతో కాలం వెల్లదీస్తున్నారాయన.
అరెస్టులకు భయపడమని గంభీరాలు పలుకుతూ.. ఎందుకు ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శలు వస్తున్నా పట్టించుకోవట్లేదు. సీఎం రేవంత్‌రెడ్డి 1౧ నెలల పాలనపై ఎందుకు ప్రశ్నించడం లేదని, రైతులు పెట్టుబడి సాయం అందక విలవిలలాడుతుంటే కాలక్షేపం చేయడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావుతో పార్టీ నడుపుతూ ప్రజలకు ఏమి ఒరగబెడుతారని అడుగుతున్నారు. పదవుల కోసం పార్టీ నేతలు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుంటే లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు ప్రతిపక్షంలోనూ చేయడం సరికాదని హితవుపలుకుతున్నారు.