30-03-2025 01:28:03 PM
హైదరాబాద్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం(Phirangipuram)లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం చూపించింది. మారుతల్లి లక్ష్మీ కార్తిక్ అనే బాలుడిని గోడకేసి కొట్టి ప్రాణాలు తీసింది. మరో బాలుడిని అట్ల పెనంతో వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సాగర్ అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో లక్ష్మీతో సహజీవనం చేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాలుడు కార్తిక్ మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్(Guntur GGH)కు తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.