calender_icon.png 7 February, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశలవారీగా సమస్యల పరిష్కారం

07-02-2025 07:54:59 PM

కార్పొరేటర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి తెలిపారు. డివిజన్ లోని శివశక్తి నగర్ కాలనీలో శుక్రవారం పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలోని పలు వీధుల్లో సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి దశలవారీగా కాలనీలోని సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, శివశక్తి కాలనీ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్, సభ్యులు ఆంజనేయులు, రమేశ్ యాదవ్, పుల్లయ్య, వెంకటేశ్, రాంబాబు, ఐలయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.