03-03-2025 08:17:30 PM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన..
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మాన్సూరాబాద్ డివిజన్ లోని బాలాజీ నగర్ కాలనీ ఫేజ్-2 నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ అసంపూర్తిగా ఉందని, నూతన డ్రైనేజీ పనులు మంజూరు చేయాలని, కొంతమేర రోడ్డు వెడల్పు చేయాలని, నూతన సీసీరోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ముందుగా డ్రైన్స్ నిర్మాణం చేపట్టి, అనంతరం రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. కార్యక్రమంలో మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి, జగదీశ్ గౌడ్, ఆనంద్ యాదవ్, కేకేఎల్ గౌడ్, అనిల్ కుమార్, వెంకట్, కాలనీవాసులు నాగార్జున రెడ్డి, జానయ్య గౌడ్, రాజు గౌడ్, జైపాల్ రెడ్డి, సాయి, కొండల్ తదితరులు పాల్గొన్నారు.