calender_icon.png 22 February, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాండం తొలుచు పురుగును ఆదిలోనే నివారించాలి

21-02-2025 07:56:52 PM

వ్యవసాయ శాఖ ఏఈఓ ముత్యం తిరుపతి..

మందమర్రి (విజయక్రాంతి): యాసంగి వరి పంటలో కాండం తోలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంటుందని దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి సూచించారు. మండలంలోని నార్లాపూర్ గ్రామంలో శుక్రవారం వరిపంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులకు  కాండం తొలుచు పురుగు నివారణపై అవగాహన కల్పించారు. యాసంగి వరి సాగులో యూరియా అధిక మోతాదులో వాడటం వల్ల కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంటుందని దీని ద్వారా పంట దిగుబడిలో 60 నుండి 70 శాతం మేర పంట నష్టం పోయే ప్రమాదం ఉందన్నారు.

దీనిని నివారించేందుకు గాను నాటు వేసిన 15 రోజుల్లోనే పురుగు ఉధృతిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు ఉధృతి నివారణకు గాను కార్బోఫిరాన్ 3జి గుళికలు ఎకరానికి 10 కిలోలు, లేద కాంటబెట్రో ఫ్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు, లేద క్లోరంతనెల్లి ఫ్లోర్ 4 కిలోలు ఇసుకలో కలిపి పొలంలో పలుచగా నీరు ఉంచి చుట్టూ చల్లుకోవాలన్నారు. తద్వారా పురుగు ఉధృతిని ఆదిలోనే నివారించవచ్చని అన్నారు. అలాగే డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ప్రతి సర్వే నెంబర్ సబ్ డివిజన్ లో రైతులు సాగు చేసిన పంటలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ రైతులు అరికటి రవీందర్, చిటవేణి అనిల్, ఎరా గోపాల్, చిలారపు రమేష్, కుమ్మరి సతీష్ లు పాల్గొన్నారు.